Brave Girl Story in Telugu


                        హలో ప్రజ్ఞ ఎక్కడ  ? ఇప్పుడే బయలుదేరాను సత్య .ఎలా  వస్తావు ఈ రోజు బంద్ కదా ఒహో అందుకేనా రోడ్డు పైన ఎవరు లేరు అయినా సత్య మన బాస్ చాలా పిసినారి ఈ రోజు కుడా ఆఫిస్ పెట్టాలా ఎలా రావాలి . బైక్ కుడా లేదు  నాకు లేకపొతే నేనే నిన్ను పిక్ చేసుకునే వాడిని ఓకే నేను వచేస్తాలే మా ఇంటిదగ్గర నుండి పది నిముషాలు అంటు ఫోన్ కట్ చేసింది ప్రజ్ఞ .రోజు వెళ్లే దారేకదా మొబైల్ లో సాంగ్స్ పెట్టుకుని చెవులో హెడ్ సెట్ పెట్టుకు నడుస్తోంది .ఇంతలో తనని ఎవరో ఫాలో అవుతున్నారనిపించి వెనక్కి తిరిగింది ఎవరు లేరు నా భ్రమ ఒక్కదాన్నే ఉన్నాకదా అందుకే అలా అనిపించింది అని తనకుతానే దైర్యం చెప్పుకుని ముందుకు నడుస్తోంది కొంచం దూరం వెళ్ళాక మళ్ళీ అలనే అనిపించింది ఎందుకైనా మంచిది అని వేగంగా నడుస్తుంది తనకి మెల్లిగా అర్ధం అయింది తన వెనుక ఎవరొ ఉన్నారు అని వెన్నక్కి తిరగాలి అంటె బయం వేగం ఇంక పెంచింది వాల్ల మాటలు వినిపిస్తున్నాయి నాకోసం అని తెలుస్తుంది నడక కాస్త పరుగు అయింది కానీ తనని తాను కాపాడుకోలేదు అని తెలుస్తుంది ఇంత కంగారులో ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తోంది చేతిలో ఉన్న ఫోన్లో తన లొకేషన్ తోపాటు  హెల్ప్ అని షేర్ చేసి ఫోన్ జాగ్రత్తగా బ్యాగ్ లో పెట్టినప్పుడు అమ్మ పెట్టిన లంచ్ బాక్స్ చేతికి తగిలింది వేంటనే పక్కనే పొదలలో దాక్కుని ఓపెన్ చెసింది అది చూడగానే కొంచం దైర్యం వచ్చింది వేంటనే వాటర్ బాటిల్ తిసుకుని అందులొ అమ్మ ఈ రోజు లేటు అయింది అని ఆవకాయ పెట్టింది కొంచం ఎక్కువే పెట్టిందీ అందరి కోసం మొత్తం ఆవకాయ నీళ్లలో కలిపింది ఇంక బ్యాగ్ లో ఏమి ఉన్నాయో చూసింది వణికే చేతులతో  బొట్టుబిళ్లలు,లిప్ స్టీక్ తీసి బయట పడేసింది తను ఇంక ఎదో వెతుకుంది బాడీ స్ప్రే ఇంక వెతుకుంది దొరికింది సత్య ఈ మధ్య ఎక్కువుగా స్మోక్ చేస్తున్నాడు అని తన లైటర్ సిగరెట్ తిసుకుని నిన్న బ్యాగ్ లో వేసుకుంది దానితో పాటె ఇంకేదో దొరికింది ఫేవిస్టిక్ ఆఫిస్ కోసం కొన్నాను ఇది కనిపించ లేదు అని మా బాస్ నా దగ్గర వంద తీసుకున్నాడు ఏది ఏమైనా తను ఎదుకోవాలి అని దైర్యంగా ఉంది .వాళ్ల మాటలు వినిపిస్తున్నాయి బయటకి రా అని అరుస్తున్నారు తప్పించుకోలేవు అని బెదిరిస్తున్నారు, వాళ్ళు  దగ్గరి వస్తున్నారు ప్లీజ్ నన్ను వదిలేయండి అని అడిగిన వినటంలేదు దగ్గరికి రాగానే ఆవకాయ వాటర్ వాళ్ల కళ్లలో పడేలాగా విసిరికొట్టి తన చున్నీతో ఇద్దరి కాళ్ళని కట్టేసింది వేంటనే ఫేవిస్టిక్ తీసుకొనే ఇద్దరి చేతులమీద వేసింది వాళ్లు కళ్లు మండుతుంటే తుడుచుకోవటాని వీలు లేకుండా చెతులు ఒకడికి ముఖం మీద మరొకడికి తలమీద అతుకున్నాయి విడిపించుకునే  లోపు కాళ్ళు కట్టి ఉండటంతో కిందపడి అరుస్తున్నాను నీ సంగతి చూస్తా అని వెంటనే లైటర్ తిసుకుని వెలిగించి బాడీ  స్ప్రే నీ గట్టిగ నొక్కేసింది కొంచం మంట వచ్చి ఇద్దరి శరీరం కాలింది దానిపైన మిగిలిన ఆవకా వాటర్ పోసి లంచ్ బాక్స్ నీ తన బ్యాగ్ లో పెట్టి తన బలం మొత్తం పెట్టి గట్టిగ కొట్టడం మొదలు పెట్టిందీ దానితో ఆ దొంగలు పారిపోవడానికి కుదరలేదు ఇంతలో సత్య పోలీసులని తిసుకుని వచ్చాడు వాల్లని కోట్టబోయి వీళ్ళని ఇంతలా కొట్టారు ఇలా చేయటం చట్టాన్ని మీ చేతులోకి తీసుకోవటం మంచిదికాదు మిస్ ,ముందు మిరు మీ ముఖానికి ఉన్న స్కార్ఫ్ తీస్తారా .సారి సర్ నేను తీయను ఎందుకంటే నా గురించి అందరి తెలియటం వలన మళ్ళీ ఈ దొంగల వలన సమస్యలు వస్తాయి కానీ సర్ మీకు మరో విషయం చెప్పాలి మీరు ఇక్కడికి వచ్చే దాక నేను మౌనంగా ఉంటే నా లైఫ్ ఈ రోజుతో ముగిసిపోయేది అందుకే నన్ను నేనే కాపాడుకున్నాను అంటు వెళ్ళిపోతుంది ఈ లోగ ఎవరొ పిలుస్తున్నారు ఎవరా అని చుస్తే అమ్మ మాటలు ఆఫిస్ టైం అయిపోతుంది ఇంకా ఆ మొద్దు నిద్ర ఏంటి లెగు అని అరుస్తుంది ఆ అరుపులకి ఉలిక్కిపడి లేస్తుంది ప్రజ్ఞ చాచా ఇదంత కల ..! నాకు నిజంగానే దైర్యం వచ్చేసింది అనుకున్నాను అంటు వేంటనే తన బ్యాగ్ చుసింది అంటె నా బ్యాగులో ఇన్ని ఆయుధాలు ఉన్నాయా అంటు ఆలోచిస్తూ బయటకి వెల్లింది కూరగాయలు కోస్తున్న వాళ్ళ అమ్మని అలనే చూస్తోంది. ఇంకా తయారుఅవలేదా అదికాదు అమ్మ కొంచం గట్టిగ కొస్తే మనిషి చేతులు ఇంకా ఏవైనా కోసేయచ్చుగా కూరగాయల కోయటం ఆపేసి కూతురికి ఏమియందా అని చూస్తుంది అదేమిటీ అలా అన్నావు అదికాదు అమ్మ అని కల గురించి చెప్పి మనలని కాపాడుకోవటానికి భయపడకుండా కొంచం ప్రయత్నిస్తే బయట పడగలమా అమ్మ అని అడుగుతుంది .విను నువ్వు అన్నది పరవాలేదు కానీ దానికీ దైర్యం కావాలి అదికాదు అమ్మ మన జోలికి వస్తే చిన్న చిన్న చీమలని ,దోమలనే వదలం కాదా అమ్మలు మనిషికి వాటికీ పోటీనా మరీ పిచ్చి పిల్లలా ఆలోచచించకు  వెల్లి రెడిఅవు ఇకనుండి రాత్రిళ్ళు ఆ టీవీ ప్రోగ్రాంలు చూడటం మానెయ్ అది కాదు అమ్మ .ముందు వెల్లి తయారవు ...అమ్మ ఏంటి అలా అన్నది ఇంకా ప్రజ్ఞ ఆ ఆలోచనల నుండి బయటకి రాలేదు నిజంగానే ఆ పరిస్థితిలో ఎవరిని వాళ్లు కాపాడుకోలేరా అంటే నేను అంతా బలహీనురాలిన నా ఉద్దేశంలో కొంచం ప్రయత్నిస్తే బయట పడతామేమో ...ఇంకా వెళ్లలేదా అనే అరుపు వినగానే అమ్మొ బాత్రూంలోకి వెళుతుంది ..ఎంటో ఈ పిల్లలు వాళ్ల ఆలోచనలు అయిన దాని మాటలలో నిజం లేకపోలేదు చి  కాపాడుకోవటానికి  పిల్లి అయిన పులి అవుతుంది అంటారు అలాగే మన దగ్గర ఉన్న చిన్న చిన్న వస్తువులే ఆయుధాలు అవుతాయి వాటితో పాటు దైర్యం కావాలి కానీ ఇవన్నీ చెప్పినంత సులువు కాదు అలా చేయటానికి అయిన నేను ఇలానే ఆలోచిస్తున్న ఏంటి అంటు తన పనిలో మునిగిపోతుంది ప్రజ్ఞ వాళ్ల అమ్మ .....
          ఎందుకు అంటే తను కుడా స్త్రీ ఏ కదూ ...మీరు ఎప్పుడైనా ఇలా దైర్యంగా ఉన్నారా..!? మీకు ఇలాంటి పిచ్చి ఆలోచనలూ వస్తే కామెంట్  లో తెలపండి .కొపం వస్తే తెలుసుకదా మన్నించండి ప్లీజ్ ...ప్లీజ్ ...
 
                                             🙂🙂  🙏🙏ధన్యవాదాలు... ధన్యవాదాలు... ధన్యవాదాలు.... 🙏🙏 🙂🙂

Comments

Popular posts from this blog

Hospital with my grand Mother

Girl to Woman to ?