Girl to Woman to ?

                     పువ్వులని చూస్తుంటే మనసుకి చాలా బాగుంటుంది వాటిని చూస్తూ అలాగే ఉండిపోవచ్చుకదా !
కానీ నాకు ఇప్పుడు వాటిని చూస్తే అసూయగా ఉంది వాటి జీవతం కొంత కాలంలోనే ముగుసి పోతుంది దానికి ఏ బాధలు ఉండవు నాలాగా, (అఫ్కోర్స్ ఆడపిల్లలాగా,) మొగ్గ నుండి పువ్వుగా మారగానే దాని జీవితం ముగుస్తుంది  అది ఏ దేవుని పటానికో లేదా దేశం కోసం పోరాడి ప్రాణాలు త్యాగం చేసిన  సైనికునికాని పాదాల దగ్గరికి చేరటం వాటికోరిక అని చిన్నతనం లో  చదువుకున్నట్టు గుర్తూ, అవి అలా అన్నా హయిగా ఉన్న అన్నీ రోజులు ప్రశాంతంగా ఉంటాయి .మనకి అలా కాదు కదా వన్స్ ఒకసారి ఆడపిల్లగా పుట్టాము అంటే అంతే అసలు మనలని కనలా వద్దా అనేరోజుల నుండి బయటకి వచ్చాము కానీ ఏమి లాభం ఇప్పుడు ఎలాగోలా పుడతాం మనకి మంచి లైఫ్ ఉంటే బాగుండు అనుకునే లోపే అంత మారిపోతుంది చెప్పటానికి అవకాశం ఇవ్వని తండ్రి దగ్గర నుండి చెప్పిన మాటవినని భర్త మన జీవితంలోకి వచ్చేస్తాడు అప్పుడు బతకటం ఎలా ఎవరికీ చెప్పాలి వచ్చిన  భాద అమ్మకి చెప్పినా తనకి నా లాంటి స్థితేకదా అప్పుడు అనిపిస్తుంది చెప్పుకోడానికి ఆడపిల్లకి ఎవరు ఉండరు అని ఇటువంటి పరిస్థిలో రేపు భవిష్యత్తులో కొడుకులు గౌరవిస్తారు అనే ఆశా ఉండదు అప్పుడే  జీవితం నిరాశతో కొట్టుమిట్టాడుతుంది .కానీ ఆడపిల్లలు వచ్చే జన్మలోయిన పువ్వులా పుట్టాలి అని కోరుకుందాం అప్పుడు మనలని బాధ పెట్టాలి అనే ఆలోచన  వచ్చే లోపే జీవితం ముగిసిపోతుంది .కానీ నిజంగా అలాగే జరిగితే వాటి తల రాతా కూడా మరిపోతుందేమో.........................!?

Comments

Popular posts from this blog

Hospital with my grand Mother