women sad story

         హలో హేమ నేను అమ్మని చెప్ప అమ్మ ఎలాఉన్నావు ఇక్కడ మేము బనే ఉన్నాము గానీ ఇషు ఎలాఉన్నది బనే ఉంది అమ్మ కాలేజీలో అలా జరిగేసరికి పది రోజులు సెలవలు ఇచ్చారు ఇంటి పట్టునే ఉంటుంది ఎక్కడికి వెళ్లటంలేదు దానిగురించి ఆలోచిస్తూ దిగులుగుగా ఉంటుండి అమ్మ హ నేను అది తెలిసే ఫోన్ చేశా అక్కడే ఉంటె అవే ఆలోచనలు వస్తాయి కొన్ని రోజులు ఇక్కడికి పంపరాదు ఆయన కుడా అదే అన్నారు అమ్మ రేపు పొద్దున్న బండికి పంపిస్తా సరే జాగర్త అల్లడుగారిని అడిగానిచెప్పు ఉంటేనే ... ఇషు అమ్మమ్మ ఫొన్ చేసింది నిన్ను రమ్మంది కొన్ని రోజులూ ఉండి రాకూడదు తాతగారు కుడా లేరుకదా మామ్ నాకూ ఎక్కడికి వెళ్లాలనిలేదు గ్రానీ నీ ఇక్కడికి రమ్మను  అంటూ హెడ్ సెట్ పెట్టుకుని కళ్ళుమూసుకుంటుంది ఎంత ఆపినా కళ్లలోనుండి నీరు ఆగటంలేదు ఈ బాధనుండి బయటపడటానికి ఊరుకి వెళ్ళటమే మంచిది చెప్పిన మాట వినరా కళ్లు తుడుస్తోంది సారి మామ్ నీమీద అలా అరవకూడదు తల్లికి పిల్లల మనసు తెలుస్తోంది నిబాధని నేను అర్థం చేసుకోగలను సరే మామ్ నేను వెళతాను డాడ్ నీ టికెట్ బుక్ చేయమను అంటూ నిద్ర లోకి జారుకుంటుంది ఇషా ....
      
         బాయ్ మామ్ డాడ్  .. జాగర్త ఇవెనింగ్ కాల్ చేయి ఒకే మామ్ అంటూ తన సీట్ లో కూర్చొని హెడ్ సెట్ పెట్టుకుని కళ్లుమూసుకుంటుంది కొద్ది సేపటికి కన్నీళ్లు రావటం మొదలైంది వెంటనె లేచి కళ్లు తుడుచుకొని వాటర్ తాగుతుంది ఇంతలో తనని ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది గుండెల్లో ఎదో కంగారు చెమటలు పడుతున్నయి వాటిని తుడుచుకుంటూ ఆలోచిస్తోంది జరిగినవి వద్దన్నా అవే గుర్తుకు వస్తున్నాయి అయిన చుట్టూ ఇంతమంది ఉన్నారు దైర్యం తెచ్చుకుంది  బయలుదేరే ముందు హేమ చెప్పిన తలుచుకుంటుంది బయపడకు  మేము రాలేక కదూ నిన్ను పంపేది ఒంటరిగా నీలో చాలా తెలివి దైర్యం ఉన్నాయి అని నీకు తెలుస్తుంది ఈ లోకం చాలా పెద్దది  అందులో చాలా జీవితాలు ముగుస్తుంటాయి మొదలుతుంటాయి అవి కొన్ని దారుణంగా ఉంటాయి కానీ మన వాళ్లకి ఏదయినా జరిగినప్పుడు బాధ తప్పదు అది కొన్నాళ్ళకి మరిచిపోవటం జరుగుతుంది కానీ అసమయం లోనే మనం దైర్యంగా ఉండాలి జరిగిన దారుణాన్ని మరచిపోవటానికి ప్రయత్నం చేయి  అమ్మగా ,స్త్రీ గా నేనూ చెప్పవలసింది చెప్పాను జాగర్తగా వెళ్ళు .... బస్సు హారన్ మోగటంతో తన ఆలోచనలోనుంచి బయటకి వచ్చింది ఎందుకో కొంచం మనసు తేలిక పడినట్టు ఉంది ... 
          
             ఊరు దగ్గరికి వచిన్నట్టే అందరు లగేజి తీసుకొండి డ్రైవర్ అన్నాడు కోనసీమ రెండు కిలోమీటర్లు మేలురాయి కనిపించింది ఇంకో పది నిమిషాలలో వెళ్ళవచ్చు బస్సు ,కిటికోలుంచి బయటకి చూస్తుంటే చుట్టు పచ్చని పొలాలు ఆకాశాన్ని తాకుతాయేమో అనేలాంటి తాటి చెట్లు కనిపిస్తున్నాయి ఇక్కడ ప్రతి వేసవిలో వచ్చేవాళ్ళము పైడిరాజు అమ్మమ్మా గారి పాలేరు తాటి చెట్టు ఎక్కి మాకు ముంజలు తెచ్చి పెట్టేవాడు సాయంత్రం అమ్మమ్మ వాళ్ళ పెరటిలో కొబ్బరి చెట్టు నీడలో మంచం వేసుకొని కుర్చొని తినేవాళ్ళం, అమ్ముమ్మ సావిత్రీ చాలా మంచింది మా తాతయ్య పోయిన మామయ్య సరిగా చూసుకోపోయిన ఒంటరిగ ఉంటుంది మా దగ్గరికి రమ్మని అమ్మ నాన్నలు చాలా సార్లు చెప్పిన వినలేదు , ఎవరున్నా సాయం అడిగితె లేదుఅనకుండా చేస్తుంది మా వేసవి మొత్తం అక్కడే గడిచేది అమ్మమ్మ రకరకాల పిండివంటలు చేసి పెట్టేది ఇంతలో బస్ ఆగింది కొందరు దిగారు నా స్టాప్ ఇంక రాలెదు అయిన ప్రతి ఏడాది ఇక్కడికి వస్తాం కానీ ఈసారి కొత్తగా ఉంది మళ్ళీ పాతరోజులు తలచుకుంటుంది పాత చేరువు వచ్చిందీ ఇక్కడ దిగేవాళ్ళు రండి డ్రైవరు అన్నాడు ... పాత చేరువు కిందటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు నేను అను ఈ చేరువు దగ్గరే బాగ ఆడుకున్నాం తనకి తామర పువ్వులు అంటే చాలా ఇష్టం పైడిరాజుని దింపి మరి ఆ పువ్వులు తెపించుకునే వాళ్ళము అణు మాట తలుచుకోగానే మళ్ళీ కళ్లు తడిచిపోయి ఈలోగా చిన్నమ్మ చినమ్మ అనే పిలుపు వినిపించింది ఎలా ఉన్నావు పైడిరాజు నేను బాగున్నమ్మ మీరే బాగ చిక్కినట్టున్నారు అదెమి లేదులే రాజు సరే లగేజి నాకివ్వండి రాజు తిసుకుని కారులో పెట్టాడు రెండు నిమిషాలలొ ఇల్లు వచ్చేసింది .....
        ఎదురుగా ఇషా  నీ చూడగానే ఎలా ఉన్నావు బంగారం పలకరిస్తుంది సావిత్రి బాగున్నా అమ్ముమ్మ నవ్వుటానికి ప్రయత్నిస్తోంది ఇషు .... గుడ్ మార్నింగ్ ఇషు నీకు ఇష్టం అని పునుగులు వేసింది గౌరీ రా వేడివేడిగా ఉన్నయి తిను కాదుఅనలేక తిన్నాను అనిపించి తన గదిలోకి వెల్లిపోతుంది   .....  ఏంచేస్తున్నావు ఎదో బుక్ చదువుతున్న ఏదయినా పనా ఇలా ఎంతసేపు రూంలోనే ఉంటావు అదేమీ లేదు అమ్ముమ్మ చదువుతూ ఉంటె టైమ్ తెలియలేదు సరే పద అలా మేడమీదా పువ్వులు తెంపి మాల కట్టిస్తా ..... 
      ఈరోజు శనివారం కదా గుడికి వెళ్దాం త్వరాగా రెడీఅవు వద్దు అమ్ముమ్మ నేను రాను ఎందుకు బాగోలేదా నుదురు మీద చేయి పెట్టి చూస్తోంది నాకు బానే ఉంది అమ్ముమ్మ రావాలని లేదు చూడు ఇషు వచ్చి రెండు రోజులూ అయ్యాయి కనీసం అలా బయటకి వస్తే కదా మనసు కుదుటపడేది అమ్ముమ్మ దానికోసం ఎక్కడికేయినా వస్తా కానీ గుడికి అయితే రాను ఎందుకు ఆ గుడి నీకు చాల ఇష్టం కదా అదే నేనూ చేసిన తప్పు అసలు లేని దేవుడు ఉన్నడు అని అనుకుని చాలా తప్పు చేశాను ఇషు అలా మాట్లాడకు కళ్లు పోతాయ్ లేదు అమ్ముమ్మ ఇప్పుడే తెరుచుకున్నాయి అసలు దేవుడే ఉంటే అను కి అలా జరిగేదా అదికాదు ఇషు చెప్పేది విను లేదు అమ్ముమ్మ నేనూ ఏలాంటి పరిస్థిలుల్లో రాను ఆ దేవుడికి మొక్కను తేల్చి చెప్పెసింది ఇషు ,కోపంతో చెయి  ఎత్తి కొట్టబోయే మనవరాలి బాధ చూసి ఆగిపోయంది  సావిత్రీ  , కాని ఎందుకు అంత ఆవేశం ... నాది ఆవేశం కాదు అమ్ముమ్మ అను నీ కాపాడలేక పోయానని నామీదా నాకే కోపంగా ఉంది అదికాదు ఇషు మనం కుడా ఎదో ఒకరోజు పోవలసిన వాళ్ళమే అది నిజమే కానీ ఎలా చచ్చిపోయిన బాధలేదు అది దాన్ని చెప్పలేక గుక్క పెట్టి ఏడుస్తుంది మనవరాలి బాధ చూసి సావిత్రీ కళ్లు చెమ్మగిల్లాయి .
        తనను ఎలాగైనా ఉరుకోపెట్టండి అమ్మగారు గౌరి కుడా కళ్లు తుడుచుకుంటూ అన్నది .... తప్పు చేసినా వాళ్లు తపించుకోలేరు అని భారతం లో కృష్ణుడు కుడా చెప్పాడుకదా దాన్ని నువ్వు బాగా నమ్ముతావుకదా సరే అమ్ముమ్మ నేను ఒకటి అడుగుతా చెప్పుతావా నాకు తెలిస్తే చెప్తా .... మరి భారతంలో ద్రౌపతి కి వస్త్రాపహరణం జరిగినప్పుడు నువ్వు చెప్పిన కృష్ణుడే చీర ఇచ్చి కాపాడాడు కదా మరీ అను అయిన మరి ఏ ఇంకొ ఆడపిల్ల అయిన అటువంటి వాల్లముకాదా !కానీ మేము అలాంటి గొప్పవాళ్ళము కాదూ అది ఒప్పుకుంటాము కనీశం మాములు మనుషులమే కదా కొంచం జాలి లేదా నీ కృష్ణుడుకి .. ఒకడు ఇద్దరు కాదు ఆరుగురు దాని మీద పడి ఎలా హింసించారో శరీరంలో కొంచం కుడా కాళీ లేకుండా గోళ్ళతో అంటూ గుక్క పెట్టి ఏడుస్తుంది చాలే చెప్పకు సావిత్రీ ఆపుతుంది ... అలా జరిగేటప్పుడు దేవుడా దెవుడా కాపాడు అని ఎన్ని సార్లు అని ఉంటుంది ఆ మాటలు వినిపించలేదా ఆ దేవుడికి కనీశం .... పోనీ చావు తప్పదు అలా జరగకుండా చూడచ్చుగా అలాంటి వాళ్ళని లేకుండా చేయచ్చుగా అది ఆఖరి నిమిషములో ఫోన్ చేసిందీ వెళ్లేసరికి శరీరం లేదు జల్లెడ ఉంది కన్నా కూతురుని అలా చుసిన వాళ్లు ఏమైపోయారో తెలుసా గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు అది వాళ్ల కూతురు చచ్చిపోయినందుకు కాదు అలాంటి చావు వచ్చిందే అని అది నా బెస్ట్ ఫ్రెండ్ చాలా మంచింది అమాయకురాలు తెలిసిన వాళ్ళేకదా అని వెల్లింది , వాళ్ళు మోసం చేశారు ....కానీ వాళ్లు ఏమి చేయలేదు అని చట్టం కుడా వాళ్ళని వదిలేసింది వాళ్ళు చాల తేలిగ్గా చట్టాని మోసం చేశారు ఆదారాలు మాయం చేసారు కొందరికీ మనీ తో కొనేసారు ... నేను మా కాలేజ్ లో అందరం కోర్టు గోడలు పగిలేలా అరిచినా ఆ న్యాయానికి వినిపించలేదు వాళ్లకి డబ్బులు మాత్రమే కనిపించాయి అక్కడ ఉన్న వారిందరికి తెలుసు నిజం కానీ న్యాయం జరగలేదు మరి ఆదేవుడన్న న్యాయం చేయాలి కదా నిజంగా దేవుడి ఉంటే కాపాడేవాడు లేదా వాళ్లకి ఉరి పడేలా చేసెవాడు అందుకే దేవుడి అసలు లేనే లేడు అమ్ముమ్మ ఇక నుండి నేను నమ్మను .... అది కాదు చెప్పేది విను ఇలా జరగాలని ఉంటే అయన మాత్రం ఏంచేస్తాడు? సరే
అది కాదు అమ్ముమ్మ భారతంలో కృష్ణుడు అంతా నేనే అటు అర్జునుడు నేనే ఇటు దుర్యోదనుడు నేనే అన్నాడు కాదా మరి దుర్యోదనుడు వలన గోరారు జారుతాయి అని తెలిసీ ఎందుకు అతన్ని ఈ లోకంలోకి తీసుకొచ్చారు ? అర్జునుడు వలన మంచి జరుగుతుంది అని తెలిసి ఆయనకి ఎందుకు అన్ని కష్టాలు ఇచ్చారు అది కాదు అమ్మలు ఇది దేవుడు లోక కళ్యాణం కోసం చేసాడు ...అమ్ముమ్మ ఆయనే ఈలోకం అని చేప్పాడుకదా మరి లోక కళ్యాణం ఎందుకు ..అయిన అమ్ముమ్మ మనిషి పుట్టినప్పుడే మరణాన్ని కూడా దేవుడు నిర్ణయిస్తాడు కదా అప్పుడు తెలియదా ఎలాంటి చావుని ఇవ్వాలి అని? రోగాలు ,ప్రమాదాలు ,ఆకలి ,పేదరికం ఈలాంటి చావుని ఇవ్వచ్చుగా ,ఇలాంటి చావుని ఇవ్వాలా అంటూ ఏడుస్తుంది ఇషా ..నిన్ను ఎలా ఓదార్చాలో తెలియటం లేదు నువ్వు ఇంకా చిన్న దానివి నీ ప్రశ్నలకు సమాధనం తెలియాలి అంటే నువ్వు  పెద్దదానివి కావాలి అప్పుడే అన్ని నీకు అర్ధం తేలుస్తుంది ..అమ్ముమ్మ నేను చిన్నదానినే నువ్వు పెద్దదానివి కదా నా ప్రశ్నలకు సమాధానం చెప్పూ నేను విని తెలుసుకుంటా కోపంగా అన్నది ఇషు ...మనవరాలి మాటలకి సావిత్రీ గారికి మాటలు రాలేదు. అయిన ఇందాకా
  తెలిసి ఎవ్వరు అలా చెయ్యరు అని అన్నావుగా మరి! దేవుడికి అన్ని తెలుసుకదా ఇలా జరగాలని ఎందుకు రాశాడు ఎలాంటి వాళ్లు ఉంటే మంచిదో తెలుసుకదా , కనీశం వాళ్లకి శిక్ష అన్నా పడేలా చేసేవాడు ,అసలు అలాంటి వాల్లని ఈ లోకంలోకి రాకుండా చేయచ్చుగా లేదా వాళ్లకి మంచి బుద్ది ఇవ్వచ్చుగా అన్ని తెలిసి దేవుడే కాపాడలేదు ఎందుకు నమ్మాలి ...వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ అడుగుతుంది ....ఇలా నువ్వు దేవుడిని 
నిందించకూడదు వాళ్ల భక్తులు వింటే గొడవ చేస్తారు  గొడవ ఎందుకు చేయాలి అమ్మమ్మ నాకు సమధానం చెప్పచ్చు లేదా అర్థమైయేలా చెప్పచ్చుగా కొపంగా వెళ్ళిపోయింది లోపలొలికి.... అమ్మ గారు ఇషు అమ్మాయిగారి మనసు బాగా విరిగిపోయింది లేదు దాని మాటలలో నిజం ఉంది కానీ బాధలో బాగా ఆలోచూస్తుంది  తను మహాభారతం బాగ చూసేది వినేది నమ్మేది కానీ నమ్మిన ఆ దేవుడు ఆదుకోలేదు అనే కోపంలో ఉంది కానీ భగవంతుడు ఏమి అంధుడు కాడు తను అందరినీ సమానంగానే చూస్తాడు అది ఇషు కీ ఎదో ఒకరోజు తెలుస్తుంది ౨.కానీ తన బాదా ఏమి చిన్నదికాదు తన మనసుకి తగిలిన గాయం మనటానికి కొంచం సమయం పడుతుంది .....
     కొంచం సేపటికి అమ్మమ్మ నేను తప్పుగా అన్నానా ఆ రోజునుంచి నా మనసులో ఇవే ఆలోచనలు కనీశం దేవుడికి ఎందుకు జాలి కలగలేదు మనుషులకి ఎలాగో లేదుకదా జాలి ఇషు అది నీ బాధ అలాంటి పరిస్థిలో ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారు నువ్వు చిన్నదానివి పైగా ఈరోజులలో పిల్లలు ఇలా ఆలోచించడం మాములే. వాళ్లకి తెలుస్తుంది నిజం ఎప్పటికి మారదు అని చేసిన దానికీ ఇక్కడే అనుభవించాలి వాళ్లకి డబ్బు సాయం చేస్తుందేమో కానీ భగవంతుడు సాయం ఉండదు నువ్వు ఇప్పుడు నమ్మలేకపోవచ్చు ఎదో ఒక నాడు నీ బాధకి జవాబు దొరుకుతుంది 
       హలో అమ్మ ఎలాఉంది ఇషు బనే ఉంది మిరు కంగారుపడకండి . తన మనసులోని బాద తగ్గటానికి ఇంక   సమయం పడుతుంది కానీ ఇప్పుడు కొంచం బానేఉంది రెండు రోజులలో కాలేజీ ఉంది అన్నది రేపు పంపిస్తా అందుకే అమ్మా దానితో నువ్వురాకూడదు నువ్వు ఉంటే దానికి బాగుంటుంది సరే నువ్వు అంతలా చెప్పాలా ....
       హాయ్ మామ్ డాడ్ ఎలా ఉన్నారు ఫైన్ బేబీ నువ్వు నేను ఒకే డాడీ .ఎలా గడిచాయి రోజులు మామ్ నేను బానే ఉన్నాను బయపడకు ....
     మళ్ళీ కలేజీ మొదలయింది రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి జరిగిందీ మర్చిపోవటానికి ప్రత్నిస్తున్నారు తప్ప చేసిన వాళ్లు బయట తిరిగితున్నారు ......

          రెండు నెలలు గడిచాయి ఆదివారం కదా ఇషు కొంచం వార్తలు పెట్టావా ఒకే డాడీ ఈ ఛానల్ కానీ ఫిల్మ్ న్యూస్ కదూ ఇషు నవ్వతూ ఛానల్ మార్చింది కూతురి ముఖంలో చాలారోజుల తర్వాత నవ్వు చుసి అలాగే ఉండిపోయాడు .... సౌండ్ 
తగ్గించు వద్దు అమ్ముమ్మ విను అంటు మామ్ మామ్ అని పిలుస్తుంది అందరు వింటున్నారు ....నిన్న రాత్రి జరిగిన ప్రమాదం లో కారులో ఉన్న వాళ్లు అక్కడికి అక్కడే చనిపోయారు వాళ్ల బండి నెంబర్ సాయంతో వాళ్లు ఎవరొ తెలుసుకున్నారు బాగ ధనవంతుల పిల్లలు పార్టీలో బాగ తాగి ఈ ప్రమాదానికి గురిఅయ్యారు వాళ్లు ____ పాలనా కాలేజ్ లో చదువుతున్న __ ___  __  __ __ _ వల్లాగా గుర్తించారు ఆ   వార్తలు వినగనే ఇషు ముఖం ఆనందంతో నిండిపోయంది 
చూసావా ఇషు నీ జవాబు దొరికిందా ఎప్పటికి ఎవరు చేసిన తప్పు నుండి తప్పించుకోలేరు అవును అమ్మమ్మ నువ్వు చెప్పింది నిజమే .కావాలంటే డబ్బులు ఇచ్చి తెచ్చుకోమను వాళ్ల ప్రాణాలు ఈ విషయం ఒక్కడిని అడగాలి వద్దు ఇషు వాళ్లకి ఈపాటికి తెలిసిఉంటుంది ఆ విషయం సావిత్రీ అన్నది ....  

       చిన్న ఎలా ఉన్నావు అక్క అంటూ పరుగున వచ్చి కొగిలించుకొని అక్క లేదు అని నువ్వు కుడా రాలేదా ఇన్నాళ్లు నన్ను చూడడానికి అదెమి కదూ చిన్నా నీ పొలీస్ ఆఫీసర్ని చేస్తాను  నా ఫ్రెండ్ కోరిక తీర్చడం నా బాధ్యత ,ఇవన్ని నీకు ఎందుకు , ఆంటీ నేను మీ కూతురులాంటిదాన్నే ఇక అన్ని మరిచిపొండి అంటూ అను ఫోటో దగ్గర తనకి ఇష్టమైన తామర పెట్టి నీ ఆత్మ శాంతించింది అనుకుంటా ఆంటీ అంకుల్ నీ నీలాగే చూసుకుంటా ఇదే నీకు నేను చేసే ప్రామిస్ అను కళ్లు మూసుకుని మనసులో అనుకుంది ఇషు ...ఈ రోజు  ఇషు తన బాదమొత్తం  మరచిపోయంది తెలీక పడిన మనసుతో అక్కడి నుండి బయటకి వచ్చిందీ తన ముఖంలో ప్రశాంతత బాగా కనిపిస్తుంది ... కన్నయ్య నీ గుడికి వచ్చి చాలారోజులు గడిచాయి నామీద కోపంగాలేదుకదా అమ్మమ్మ చెప్పింది నువ్వు తప్పకుండా న్యాయం చేస్తావు అని ........
       


                    ప్రతి తల్లి తండ్రి కొడుకు పుట్టాడు అని సంబరపడే ముందు వాడికి లోకం లోని ఆడవారుకూడా తన తల్లి లాంటిదే ఆడవారిని గోరవించటం నేర్పటం వాళ్ల బాద్యత అని తెలుసుకుంటే ఇలాంటి గోరాలు జరగవు కానీ కొంతమంది పిల్లలని కని వదిలేస్తుంటారు అలాంటి పిల్లలు మంచిని తెలుసుకునే వీలులేదు మరి చెడునీ తెలుసుకున్నవాళ్ళు ఇలాంటి పనులు చేయగలుగుతారు అందుకు పిల్లల్ని కనే ముందు లేదా వదిలేసే ముందు ఆలోచించుకొండి .
    
                                    నేనూ చెప్పింది తప్పగా ఉంటే మన్నించండి కానీ ఒక్కసారి ఆలోచించండి ....
                                       🙂🙂  🙏🙏  ధన్యవాదాలు    ధన్యవాదాలు   ధన్యవాదాలు 🙏🙏 🙂🙂

     


Comments

Popular posts from this blog

Hospital with my grand Mother

Girl to Woman to ?