Father's Day forever

           ఈ రోజు ఫాధర్స్ డే టీవిలో బిగ్ బాస్ పోగ్రామ్ వస్తుంది అందరు వాళ్ల డాడ్ గురించి చాలా బాగ చెప్తున్నారు నాకు మా నాన్న గురించి చెప్పాలి అని ఉంది కానీ ఎం చెప్పను నాన్న అంటే నడిపించే వాడు అని తెలుసు కానీ నాకు ఆ నడక తెలియదు అలా అని నాన్న అంతేమీ చెడ్డవాడు కాదు అప్పుడప్పుడు తనకి చెప్పాలి అనిపిస్తుంటుంది మేమూ మనుషులమే అని .నేను పదహారు ఏళ్ల కే గడప దాటి వెళ్ళిపోయాను అత్తారింటికి కానీ చెల్లీ తన చదువు కోసం పాతికేళ్ళు నీతోనే ఉంది నువ్వు అనే అన్ని మాటలు భరించింది తనకి అదృష్టం బాగుంది మంచి భర్త వచ్చాడు ఇప్పుడే అది సంతోషంగా ఉంటుంది ..
        రోజులు గడుస్తున్నా నీలో మార్పురాలేదు ఎవరొ ఎదో చేసారు అని ఇంటిలో నువ్వు పెట్టే టార్చర్ మేము అమ్మ తట్టుకోలేకపోతున్నది.  కానీ నాన్న నువ్వు మామ్మలిని ఎంత బాధపెట్టిన అప్పుడప్పుడు చూపించే ప్రేమ తలుచుకుంటూ బతుకుతున్నాము కానీ నాన్నా నాకు ఒకోసారి అనిపిస్తుంటుంది ఒకవేళ నా అత్తవారిల్లు నాన్ను బాధ పెడితే ఎవరికీ చెప్పుకోవాలి ఒక్కో సారి నీ గుండెల మిదా వాలి బాధని అంతా మర్చిపోవాలి అనిపిస్తుంటుంది. కాని నీకు బయటవారి మిద ఉండే జాలి మా మీదలేదు .
           న్నాన్నా నీకు చాల చెప్పాలి ఎందుకు అంటే నేను పదహారు ఏళ్ళకే ఒకరికి భార్య అయిన నేను ఇప్పుడు అంతే త్వరగా ఈ లోకం వదలాలి అని నిర్ణయిoచుకున్నాను దానికి కారణం ఎవరులేరు ఈ లోకంలో దేవుడు అనే వాడు ఉంటే నాకు  ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదికాదు ఆయనకి నిలాంటి తండ్రి ఉంటే తేలుస్తుంది ఆ బాధా . పోనిలే ఈ లోకంలోనే మంచి భర్త నాకు ఉన్నాడు అనుకున్నా ఆయన ఎంత మంచివాడు అంటే తనని ఇంట బయట మోసం చేస్తున్నారు అని చెప్పిన చూపించిన తెలుసుకోలేని మంచివాడు నాన్న ఆ మంచితనం నేను బరించలెను ఎందుకంటే అక్కడ నేను చెప్పే నిజం కంటే  తనవాళ్ళు చెప్పే అబద్దంకి విలువేక్కువ కొంచం కూడా ఆలోచించాడు నీ అల్లుడు .నా బాధ వినే వారు లేరు తిర్చేవారు లేరు ఎందుకు ఈ జీవితం .. ఒక రకంగా నేను చాలా అదృష్టవంతురాలిని అమ్మ మా కోసం ఇన్నాలు నవ్వు పెట్టె బాధలు బరించింది నాకు పిల్లలు లేరుగా నేను ఎవరి కోసం ఉండక్కరలేదు చెల్లి పెళ్ళికూడా జరిగింది కదా నాకు ఏ బాధ్యత లేదు ఇక మా ఆయన సంగతి తను సంపాదిస్తూ మోసగాళ్ళకి స్వార్ధ పరులుకి  దానం చేస్తూ బతికేస్తాడు తనకి అది చాలు .....
       గత నాలుగు నెలలుగా చాల గొడవలు ఎప్పుడులేని విదంగా చాల సంతోషంగా ఉండే లైఫ్ మారిపోయింది  చెప్పలేని బాధ చెప్పిన వినేవాళ్ళు లేరు ఏమీ చేసిన ఆయన మారటంలేదు ఇంత బాధలో ని దగ్గారికి  వస్తే నువ్వు వేరే విధంగా మాటలు అంటున్నావు ఎవారికీ చెప్పాలి ఈ మధ్య ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు బాగా అలసిపోయాను మానసికంగా చెప్పిన మాట వినని భర్త , బాధలే పట్టించుకోని నాన్న అందుకే ఒక నిర్ణయం తీసుకున్న ఏమి జరిగిన మారదు నా జీవితం కాబట్టి ఎలాంటి లైఫ్ నాకు వద్దు దిన్ని నేను వదిలేస్తున్న ఇదే నా మొదటి చివరి లేఖ అసలు స్కూల్లో లీవ్ లెటర్ రాయటం రాని నాకు జీవితానికి లివ్ లేటర్ రాస్తుంటే నవ్వొస్తుంది........................
        చివరిగా న్నాన్న.... ఈ రోజుల్లో కొడుకులు ఉన్న అనాధలుగా ఉన్న చాలామంది ఉన్నారు వాల్లు వాళ్లకి చాలా ఆస్తికుడా ఇచ్చికూడా అనాధాలుగా మిగిలారు నీకు అటువంటి పరిస్థితీ నేనూ తీసుకురాలేదు నేను .......  ఉంటాను...... 
        కేవలం రాసాను అలా ఏమి జరగలేదు ఎందుకు అంటే సమస్య ఎదుర్కునే ధైర్యంలేని నాకు ఇటువంటి పని చేయలేను అంత సాహసిని కాను.
       మీకు ఇలా జరిగి ఉంటే ఇలాంటి పిచ్చిపని చేయకండి నాకు కలిగిన బాధ వినే వారు లేక ఇలా రాసుకున్న కావాలి అంటే మీరు రాసి చూడండి కొంతవరకన్నా మీ బాధ తగ్గుతుంది..                     ఇన్ని బాధలు ఉన్నా ఎందుకు బతికిఉన్నానో తెలుసా కేవలం ఎప్పటికి అయిన అన్నీ మారతాయి అనే ఆశ.... 
                        ఎవరికి అయిన ఈ మాటలకి బాధకలిగి ఉంటే  మన్నించాలి
                            🙏🙏🙏    🙏🙏🙏    🙏🙏🙏






                                           

Comments

Popular posts from this blog

Hospital with my grand Mother

Girl to Woman to ?