Posts

Showing posts from December, 2018

Hospital with my grand Mother

   ఇప్పుడే హాస్పటలుకి వచ్చాము మా నానమ్మకి బాగోలేదు కానీ అక్కడ అటు ఇటు చుస్తూ ఉండగా నా ముందు ఒక పెద్దాయన ఉన్నాడు ఆయన్ని చూశాక చనిపోయిన మా తాతయ్య గుర్తుకు వచ్చారు చాల రోజులూ వెనక్కి వెల్లిపోయింది మనసు కొంచెం సేపటికే మనసు బాధతో నిండిపొయింది కాలం అన్నింటిని మరచిపోయాలా చేస్తుంది ఆకరి రోజులలో మా తాత గారు చాల నరకం చూశారు మంచంలో ఉండి  అవిఅన్నీ ఈ పెద్దాయన్ని చూడగనే కళ్ల ముందు మెదిలాయి అప్పుడు మెము డబ్బు కోసం ఎంత ఇబ్బంది పడ్డామో తలుచుకుంటే భయంగా ఉంది కానీ ఇప్పుడు మా నానమ్మకు చూపించ గలుగుతున్నాము ..ఇలాంటి ఆలోచనల మద్యలో డాక్టర్  రూం లొనుండి బయటకి మరొకరు వచ్చారు బయటకి ఆయన వయసు ఎనభై ఉంటాయేమో తెల్లని చొక్కా పంచ కట్టుకుని ఆరడుగుల ఆజానుబాహుడిలా ఉన్నాడు అతని భార్య కోసం వచ్చినట్టున్నారు ఆమెకూడా సన్నగా ఉంది ముఖంలో ఎదో భయంగానే ఉన్నట్టు ఉంది తను మా నానమ్మతో మాటలు కలిపింది ఎదో పరీక్ష రాశారండి దానికీ ఐదు వేలు రేపు చేయించుకుంటాము అని చెప్పింది ఈలోపు మా నెంబరు రావటంతో లొపలికి వెళ్లాము కానీ నా మనసు వారి చుట్టు తిరుగుతుంది బయటకి వచ్చేసరికి వెళ్లిపోయారు .ఆ పెద్దాయన ముఖంలో ఎంతో తేజస్సు ఉంది  ఆ రోజులలో తిండి వేరు అన